ఋణం

                           నెల్లూరు లోని వెంకటగిరి మండలం  లో శివరామయ్య , జానకి అనే దంపతులకు  మేఘన మరియు మధులత అనే ఇద్దరు అందమైన కవల  కుమార్తెలు వున్నారు. ఇద్దరినీ ఎంతో  ఆప్యాయంగా , అనురాగాలతో కష్టం అంటూ తెలియకుండా పెంచుతుంటారు. వారిలో ఒకరు చదువులో దిట్ట  మరొకరు ఆటల్లో దిట్ట.  వీరిలో మధులత అనే అమ్మాయి మేఘన కంటే పెద్దది. కానీ ఆ ఊరులో వున్నవాళ్ళందరికీ మధులత అనే అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. మేఘన ని  పట్టించుకునేవారు కారు. ఇద్దరూ ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మధులత ని పలకరించేవారు. మేఘన ఎవరితోనూ మాట్లాడేది కాదు. కానీ మధులత అనే అమ్మాయి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వుండేది. ఆ ఊరు జనం తన మీద చూపించే అసహ్యాన్ని నిద్రపోయే సమయంలో తలుచుకుంటూ మేఘన ఏడుస్తూ నిద్రపోయేది. కొన్ని రోజులకి మేఘన తన అక్క మీద పగ అసుయని పెంచుకునింది. కానీ మధులత కి మాత్రం తన చెల్లెలు అంటే ఎంతో ఇష్టం. తన చెల్లెలు మేఘన బాధపడుతుంటే ఎంతో వేదన పడేది, దీనికి పరిష్కారం కనుక్కోవాలని అనుకుంది. అలాగైనా తన మీద వున్నా పగ అసుయని పోగొట్టించి ఆ ఊరి జనం ద్రుష్టి తన చెల్లెలు మీద  పడేటట్లు ఒక గుర్తింపు తీసుకుని రావాలని అనుకుంది.
అలా తన చెల్లెలుకి  దేంట్లో  ఆసక్తి వుందో తన  చెల్లెలు స్నేహితులని అడిగి తెలుసుకుంది. తర్వాత ఒక పరుగుపందెం పెట్టి ఆ విధంగా తన చెల్లేని టాలెంట్ ని అందరికి చూపించాలి అని భావించి తన చెల్లులు యొక్క స్నేహితురాలితో ఈ యొక్క ప్లాన్ ని మేఘనకి చెప్పమని అన్నది. కానీ తను చెప్పినట్లుగా  చెప్పవద్దని అంటుంది. అలానే అని మేఘన స్నేహితురాలు మేఘన వద్దకు వెళ్లి ఇలా అనింది.
                           నువ్వు మీ అక్కకన్నా గొప్పదానివని అందరి చూపు నీ మీద పడాలంటే  ఒక పని చెయ్యాలి. ఒక పరుగుపందెం పెట్టాలి అది మీ అక్క చెల్లులు ఇద్దరి మధ్యే  ఉండాలి. దానికి మేఘన అలాగేనని ఒప్పుకుంది. కానీ అది తన అక్క పధకం అని తెలియదు. మేఘన ఆలోచించడం  మొదలు పెట్టింది ఈ పరుగుపందెం ఎక్కడ పెట్టాలి అని అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పరుగుపందెం ఊరి చివర దగ్గర వున్నా గ్రామ దేవత ఆలయం దగ్గర వున్నా రైల్వే ట్రాక్ దగ్గర పెడితే బాగుంటుందని అనుకొంది. వెంటనే తన స్నేహితురాలిని పిలిచి ఈ విషయాన్ని  ఊర్లో అందరి మరియు తన అక్కకి కుడా చెప్పమని అంటుంది. మేఘన స్నేహితురాలు ఈ విషయాన్ని ఊర్లో  ఉన్న అందరికి మరియు మధులతకి ఈ విషయం చెబుతుంది. కానీ వాళ్ళ అమ్మానాన్నలకు ఈ విషయం గురించి చెప్పలేదు. ఆ సమయం రానే వచింది. అందరూ ఆ ఊరి  చివరి దగ్గరకు చేరుకుంటారు. మధులత చేరుకొని అప్పుడే మేఘన వాళ్ళ స్నేహితురాలతో వచ్చింది. పరుగుపందెం వివరాలను ఆ ఊరి సర్పంచికి చెబుతుంది. అప్పుడు తన పరుగుపందెం గురించి ఇలా చెప్పాడు.      

ఎప్పటినుండో మేఘన మరియు మధులతలు ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం దొరికింది. అదే ఈ పరుగుపందెం,ఈ పరుగుపందెం లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారే ఈ ఊరి యొక్క ప్రశంసలు మరియు మన్ననలు పొందుతారు.ఓడిపోయిన వారు గెలిచిన వారు ఏది చెబితే అదే చెయ్యాలి.

- మరి ఈ పరుగుపందెం మన గ్రామదేవత అయిన పోలేరమ్మ ఆలయం దగ్గర మొదలవుతుంది. అమ్మవారి త్రిశూలం ఊరి చివరన ఉన్న రైల్వేగేటు దగ్గర ఉంటుంది. ఎవరైతే దానిని ముందుగా తీసుకొని వచ్చి అమ్మవారి చేతిలో పెడతారో వారే విజేత గా నిర్ణయింపబడతారు. ఇందుకు అక్క చెల్లెలు ఇద్దరు కట్టుబడి ఉండాలి.

- పోటీ ప్రారంభం కాబోతున్న సమయం లో కవలల తల్లిదండ్రులకు విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వస్తారు. కాని అప్పటికే పోటీ ప్రారంభం అయిపోయి ఉంటుంది.

- ఇద్దరు ఎంతో వేగంగా పరిగెడుతూ పోతున్నారు. కాని మధులత మేఘన కంటే ముందుగా వెళ్ళిపోయి ఉంటుంది.మేఘన ని ఎలాగైన గెలిపించాలని మధులత కావాలని రైలు పట్టాలు మీద పడిపోయింది మేఘన చూస్తుండగా. అదే మంచి అవకాశంగా అనుaకొన్న మేఘన ఆ త్రిశూలాన్ని తీసుకొని అమ్మవారి ఆలయం దగ్గరకు పోతూ ఉన్న సమయంలో దురదృష్టవశాత్తు మధులత కాళ్ళు రైలు పట్టాల మధ్యన ఇరుక్కొని పోయి అదే సమయంలో అటుగా వస్తున్నా రైలు డీకొనడంతో కాళ్ళు రెండూ తెగిపడిపోయాయి.ఈ విషయం తెలుసున్న ఆ ఊరి జనం, మేఘన వాళ్ళ అమ్మానాన్నలు అందరూ వచ్చి చూసి ఎంతో బాధ పడతారు.వెంటనే హాస్పిటల్ కి తీసుకొనిపోతారు. అక్కడ మేఘన స్నేహితురాలు నీ అక్కే నిన్ను గెలిపించాలని అలా పందెం నీ చేత వేయించమని అలా అయినా అందరి దృష్టిలో నువ్వు ఉండాలని అలా నా చేత చెప్పించింది అని చెబుతుంది. మధులత దగ్గరికి పోయి ఏడుస్తూ తను చేసిన తప్పు ని క్షమించమని కోరుకుంటద్ది.అలాగేనని నువ్వు ఏడవకు అని తన చెల్లెలి కన్నీరు తుడుస్తద్ది. నీ బదులు నేను నీ కాలేజీ కి వెళ్లి నీ చదువును నేను పూర్తి చేస్తాను అని చెబుతుంది. దానికి మధులత, తన అమ్మానాన్నలు కూడా సంతోషంతో ఒప్పుకుంటారు.

- అలా మధులత చదువుతున్న కాలేజీ కి వెళ్తుంది కాని అక్కడ ఎవ్వరికి తను మేఘన అని తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.తను చదివే కాలేజీ లో మనోహర్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది మేఘన. తను కూడా మేఘన( మధులత)ని ప్రేమిస్తాడు. అలా కాలేజీ రోజులు గడిచి పోయాయి. చివరకు విడిపోవలసిన రోజు వచ్చింది ఆ రోజు మనోహర్ మరియు మేఘన ఇద్దరు కలుసుకొంటారు. మేఘన మనోహర్ తో -నువ్వు మా ఊరికి రా వచ్చి అక్కడి పల్లె వాతావరణం, మా నెల్లూరు భోజనం, వెంకటగిరి కోట, చీరలు చూద్దువు. ఒకసారి నెల్లూరు కి వస్తే ఇంక నీకు 
తిరిగి వెళ్ళాలని అనిపించదు. అంతగా బాగుంటుంది మా ఊరు. వచ్చి మా అమ్మానాన్న లతో మన ప్రేమ గురించి కూడా చెప్పి పెళ్లి చేసుకొందాం అని అంటుంది. మేఘన తిరిగి ఊరికి వచ్చేసింది.

- మనోహర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రేమ గురించి చెప్పి ఒప్పిస్తాడు.తన అమ్మ నాన్నలతో నెల్లూరు కి వస్తాడు. మనోహర్ వచ్చిన విషయం మేఘన కి తెలియదు.తను తన స్నేహితురాలి దగ్గరికి వేరే ఊరికి వెళ్ళింది. మేఘన(మధులత) ఇంట్లోకి వచ్చిన  మనోహర్ మధులత కి కాళ్ళు లేకుండా చూసి బాధపడ్డాడు.ఎంతగానో ఏడ్చాడు కాని తన ప్రేమని నిలబెట్టుకోవాలని పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని అంటాడు. మొదట్లో మనోహర్ అమ్మానాన్న ఒప్పుకోక పోయిన చివరకు ఒప్పుకున్నారు. మధులత(అసలు)కి వాళ్ళ అమ్మానాన్నలకి ఎంతో సంతోషం వేసింది.అందరూ  ఆనందం గా ఉంటూ అప్పుడే నిశ్చయ తాంబూలాలు కూడా కుదుర్చుకునేస్తారు. అప్పుడే ఊరి నుంచి వచ్చిన మేఘన కిటికీ నుంచి చూసి మొదట తనని కాకుండా తన అక్కని పెళ్లి చేసుకుంటున్నాడని బాధ పడుతుంది తర్వాత తన వల్లే కాళ్ళు పోగొట్టుకున్న తన అక్క జీవితం మనోహర్ తో బాగుంటుందని ఊహించి సంతోషించింది. తన అక్క పెళ్లి అయ్యే వరకు తను కనిపించకూడదని భావించి తను వేరే దగ్గరికి వెళ్ళిపోయింది ఎవ్వరికి కనిపించకుండా కాని తను రాసుకునే డైరీ మాత్రం తన స్నేహితురాలి దగ్గర ఉండిపోయింది..................................................................................................................................

తర్వాత ఏమి జరిగింది ???
తన స్నేహితురాలి డైరీ చదివిందా? చదవలేదా? 
ఒకవేళ చదివి ఉంటే ఆ విషయాన్నీ ఎవరికి చెప్పి ఉంటుంది ?
మనోహర్ కా ???  వాళ్ళ అమ్మ నాన్నలకా ??? లేక తన  అక్క మధులతకా???
లేకుంటే చదివి ఎవ్వరికి చెప్పకుండా తన మనసులోనే దాచుకుందా?

రెండవ భాగం కొన్ని రోజులలో ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

                                                                                                                              ఇట్లు మీ ప్రేమతో 
                                                                                                                              మీ రచయిత 
                                                                                                                              జక్కల చంద్ర శేఖర్ 
                        
SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog. I’m CEO/Founder of Creative Thoughts Group and CC Short Films. I’m Creative Art Director, Business Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment